Wanted Reporters

Wanted Reporters

సినిమాలో ఐదు నిమిషాలు నా నిజ జీవిత పాత్ర:టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వెల్లడి



 సోనియాగాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా నిర్మిస్తా


వచ్చే ఏడాది డిసెంబర్ 9న సినిమా విడుదలే లక్ష్యం


సీఎం రేవంత్, మహేష్ గౌడ్‌తో సినిమాపై చర్చిస్తా


సినిమాలో ఐదు నిమిషాలు నా నిజ జీవిత పాత్ర


తల్లి కష్టాలు మా అమ్మను చూసి తెలుసుకున్నా


సోనియాగాంధీ త్యాగాలు, సేవలను ప్రపంచానికి చాటుతా


ప్రధానమంత్రి పదవిని మూడుసార్లు తిరస్కరించిన నాయకురాలు సోనియా


పీవీ, మన్మోహన్‌లను ప్రధానులుగా చేసిన ఘనత సోనియాదే


తెలంగాణ ఇచ్చిన సోనియాను మనం గౌరవించుకోవాలి



టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వెల్లడి



సంగారెడ్డి,వాస్తవ తెలంగాణ న్యూస్:


కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ జీవిత ప్రయాణం ఆధారంగా సినిమాను నిర్మించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. సోనియాగాంధీ రాసిన ఆత్మకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబర్ 9 నాటికి సినిమాను విడుదల చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

చిన్న వయసులోనే పిల్లలు ఉన్నప్పుడు తండ్రి మరణిస్తే ఆ తల్లి పడే కష్టాలు ఎలా ఉంటాయో తనకు తెలుసని, తన తల్లి జీవితాన్ని చూసి ఆ బాధను అర్థం చేసుకున్నానని జగ్గారెడ్డి అన్నారు. అందుకే సోనియాగాంధీ జీవిత ప్రయాణాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో సినిమా తీయాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఈ సినిమాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తనకు సన్నిహితంగా ఉన్న మంత్రులతో చర్చించనున్నట్లు తెలిపారు. సినిమాలో తన నిజ జీవిత పాత్ర కూడా ఐదు నిమిషాల పాటు ఉంటుందని వెల్లడించారు.

ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల ఆశయాలను దృష్టిలో పెట్టుకుని పార్టీని నడిపిస్తూ ప్రజాసేవ చేసిన చరిత్ర సోనియాగాంధీదని కొనియాడారు. మూడుసార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ పదవిని తిరస్కరించి, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ వంటి నాయకులను ప్రధానులుగా చేసిన ఘనత ఆమెదని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులు కావడంలోనూ సోనియాగాంధీ పాత్ర ఉందని వ్యాఖ్యానించారు.

ప్రతి మహిళను తల్లిగా గౌరవించాలని ప్రసంగించే ఆర్ఎస్ఎస్ నేతలు సోనియాగాంధీ విషయంలో మాత్రం విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ ఆ విషయాన్ని తన పుస్తకంలో ప్రత్యేకంగా రాసుకోవాల్సిన అవసరం ఏముందని, ఆమె చేసిన సేవలను మనమే గుర్తించి గౌరవించాలని అన్నారు. టీఆర్ఎస్ నేతలు ఈ విషయాన్ని ఆలోచించాలని, మంచి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన బోయినపల్లి వినోద్ కుమార్ ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయడం తగదని విమర్శించారు. కంగనా రనౌత్ నాయకురాలు కాదని, ఆమె కేవలం నటీమణి మాత్రమేనని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.

Post a Comment

0 Comments

Ad Code