Wanted Reporters

Wanted Reporters

గుమ్మడిదల అభివృద్ధిలో కీలక ముందడుగు :ఎమ్మెల్యే జిఎంఆర్

 




నాలుగు కోట్ల 29 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన..

ప్రతి వార్డు అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక..

పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి 

గుమ్మడిదల,వాస్తవ తెలంగాణ న్యూస్: 

గుమ్మడిదల మున్సిపల్ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తూ.. ప్రతి వార్డును అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. 

గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం, దోమడుగు, వీరన్న గూడెం, బొంతపల్లి, గుమ్మడిదల వార్డులలో నాలుగు కోట్ల 29 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంగళవారం ఉదయం ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలలో ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన గుమ్మడిదల మున్సిపల్ పరిధిలో గల ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి కాలనీలో మౌలిక వసతులు కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు.. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. 

అధికారులు, ప్రజాప్రతినిధులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. 

నిర్దేశిత గడువులోగా పనిలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని కోరారు.

ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, కమిషనర్ దశరథ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code