Wanted Reporters

Wanted Reporters

గుమ్మడిదల మున్సిపాలిటీలో 17న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్న ఎమ్మెల్యే జిఎంఆర్


 గుమ్మడిదల మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు రేపు శంకుస్థాపనలు

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం

అన్నారం నుంచి గుమ్మడిదల వరకు ఐదు గ్రామాల్లో కార్యక్రమాలు

గుమ్మడిదల,వాస్తవ తెలంగాణ న్యూస్:

గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రేపు (నవంబర్ 17) శంకుస్థాపనలు నిర్వహించనున్నారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

ఈ కార్యక్రమాల షెడ్యూల్ ప్రకారం ఉదయం 9 గంటలకు అన్నారం గ్రామంలో, 9:15 గంటలకు దోమడుగు గ్రామంలో, 9:30 గంటలకు వీరన్నగూడెం గ్రామంలో, 10 గంటలకు బొంతపల్లి గ్రామంలో, 10:30 గంటలకు గుమ్మడిదల గ్రామంలో శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమాలకు గుమ్మడిదల మున్సిపాలిటీ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని గుమ్మడిదల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments

Ad Code