Wanted Reporters

Wanted Reporters

నెహ్రూ నాడు నాటిన అభివృద్ధి విత్తనాలే నేడు మహావృక్షాలు: జగ్గారెడ్డి





 నెహ్రూ నాడు నాటిన అభివృద్ధి విత్తనాలే నేడు మహావృక్షాలు

దేశ నిర్మాణానికి బలమైన పునాదులు వేసిన మహానేత నెహ్రూ

సంగారెడ్డిలో ఘనంగా జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి, వాస్తవ తెలంగాణ న్యూస్:

స్వాతంత్ర్యం అనంతరం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించి, దేశ నిర్మాణానికి బలమైన పునాదులు వేసిన మహానాయకుడు తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. నెహ్రూ నాడు దేశ అభివృద్ధి కోసం నాటిన విత్తనాలే నేడు మహావృక్షాలుగా ఎదిగి ప్రజలకు నీడను, ఫలాలను అందిస్తున్నాయని పేర్కొన్నారు.

నెహ్రూ జయంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఐబీ జంక్షన్ వద్ద ఆయన విగ్రహానికి జగ్గారెడ్డి, టీజీఐఐసీ మాజీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. దేశ తొలి ప్రధానిగా నెహ్రూ బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆహార కొరత, పారిశ్రామిక వెనుకబాటుతనం, మౌలిక వసతుల లేమి వంటి అనేక సమస్యలు ఉన్నాయని గుర్తుచేశారు. వాటిని అధిగమిస్తూ వ్యవసాయం, పరిశ్రమలు, విద్యారంగాల అభివృద్ధికి నెహ్రూ విశేష కృషి చేశారని తెలిపారు. నాగార్జునసాగర్ వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు, ఐఐటీలు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఏర్పాటుకు ఆయన తీసుకున్న చొరవ దేశ అభివృద్ధికి పునాదిగా నిలిచిందన్నారు.

దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల ప్రక్రియ, శాసన, న్యాయ వ్యవస్థల పటిష్టతకు నెహ్రూ కృషి చేశారని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ బలహీన వర్గాలకు అండగా నిలిచే పాలన అందించారని కొనియాడారు.






Post a Comment

0 Comments

Ad Code