Wanted Reporters

Wanted Reporters

ఛట్ పూజ కోసం రూ.2.50 లక్షలతో గుండం ఏర్పాటు




ఛట్ పూజ కోసం రూ.2.50 లక్షలతో గుండం ఏర్పాటు

బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ ప్రజల ఇబ్బందులను గుర్తించి మున్సిపల్ చైర్మన్ గద్దె సుష్మా గణేష్,కౌన్సిలర్ గండి స్వప్న కుమార్ యాదవ్ చొరవతో ఏర్పాటు

ముఖ్య అతిథులుగా మాజీ జెడ్పీటీసీ కోలన్ బాల్ రెడ్డి,శంభీపూర్ కృష్ణ

జిన్నారం, వాస్తవ తెలంగాణ న్యూస్:

జిన్నారం మండలం ఖాజిపల్లి గ్రామ పరిధిలోని జీఎంఆర్ కాలనీలో నివసిస్తున్న బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ప్రజల కోసం ఛట్ పూజ నిర్వహణకు ప్రత్యేకంగా గుండం (సంప్) ఏర్పాటు చేశారు. సుమారు రూ.2.50 లక్షల వ్యయంతో గద్దె సుష్మా గణేష్, గండి స్వప్న కుమార్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ ఏర్పాటు చేయించారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన అనేక కుటుంబాలు జీఎంఆర్ కాలనీలో స్థిరపడి జీవిస్తున్నాయి. ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా నిర్వహించే పవిత్ర ఛట్ పూజ సందర్భంగా నీటి సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించి ఈ ప్రత్యేక ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ జెడ్పీటీసీ కోలన్ బాల్ రెడ్డి, శంభీపూర్ కృష్ణ మాట్లాడుతూ.. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న ప్రజల ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూ, వారి పండుగ నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం అభినందనీయమన్నారు. ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code