నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించేది కాంగ్రెస్ ప్రభుత్వమే:మంత్రి వివేక్ వెంకటస్వామి
పటాన్చెరు నియోజకవర్గానికి 3,350 ఆసరా పింఛన్లు పంపిణీ.
గుమ్మడిదలలో లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాల అందజేత.
మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి రూ.12 వేల కోట్లు ఖర్చు.
నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరు.
గత ప్రభుత్వం పేదలకు ఇళ్లను అందించడంలో విఫలమైంది.
కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి.
గుమ్మడిదల,వాస్తవ తెలంగాణ న్యూస్:
నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమని, గత ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇచ్చే విషయాన్ని మరిచిపోయిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల లో పటాన్ చెరు నియోజకవర్గం లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు ఆసరా పింఛన్ల పత్రాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజక వర్గానికి 3350 ఆసరా పింఛన్లు అందివ్వడం సంతోషకరంగా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని వెల్లడించారు. మహిళల కోసం ఉచిత బస్సుకు 12వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. నియోజక వర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు రెండు వందల కోట్లు మంజూరు చేసి నిర్మిస్తున్నామని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫ్రీ విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, పాఠశాలలో ఉచిత బ్రేక్ ఫాస్ట్, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని, కాంగ్రెస్ మానిఫెస్టో లోనే సంక్షేమ పథకాలు సైతం అమలుచేస్తున్నామన్నారు. అంతే కాకుండా సిద్దిపేటలో జరిగే సభలో మన ముఖ్యమంత్రి పేదల కోసం ఇందిరమ్మ జీవిత బీమా పథకానికి నాంది పలుకనున్నారని అన్నారు. గత ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇవ్వకుండా మోసం చేశారని, ప్రస్తుత ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసి నిర్మిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం, దేశం, రాష్ట్రం ఎల్ నీనో ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి, నీటిని పొదుపుగా వాడుతూ రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలన్నారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్, రాష్ట్ర నాయకుడు నీలం మధు స్థానిక కౌన్సిలర్ లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments