Wanted Reporters

Wanted Reporters

రూ.9 కోట్లతో భారీ నందీశ్వర విగ్రహ నిర్మాణానికి నిర్మల జగ్గారెడ్డి శ్రీకారం


  684 టన్నుల భారీ విగ్రహం ఏకశిలతో ఎర్పాటు

ఫసల్‌వాదిలో ఆధ్యాత్మిక అద్భుతం.. 684 టన్నుల ఏకశిలతో భారీ నందీశ్వర విగ్రహం!

రూ.9 కోట్లతో నందీశ్వర స్వామి విగ్రహం.. శిలా పనులు ప్రారంభించిన జగ్గారెడ్డి, నిర్మల

నందీశ్వర విగ్రహ నిర్మాణానికి అందరూ సహకరించాలి: జగ్గారెడ్డి

284 చక్రాల భారీ వాహనంపై తరలించనున్న 684 టన్నుల ఏకశిల

సంగారెడ్డి,వాస్తవ తెలంగాణ న్యూస్:

సంగారెడ్డి జిల్లా ఫసల్‌వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ప్రాంగణంలో మరో అద్భుత ఆధ్యాత్మిక నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు రూ.9 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన సువర్ణ శృంగ నందీశ్వర స్వామి భారీ ఏకశిలా విగ్రహ నిర్మాణ పనులను సోమవారం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి, టీజీఐఐసీ మాజీ చైర్‌పర్సన్ నిర్మల ప్రారంభించారు.

మహేశ్వర శర్మ సిద్ధాంతి పర్యవేక్షణలో చేపట్టిన ఈ మహత్తర కార్యక్రమంలో భాగంగా 684 టన్నుల బరువున్న భారీ ఏకశిలతో నందీశ్వర స్వామి విగ్రహాన్ని రూపొందించనున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి శిలా పనులకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు.

సంగారెడ్డి సమీపంలోని ఎర్దనూర్ గుట్టల నుంచి ఈ భారీ ఏకశిలను సేకరించారు. 32 అడుగుల పొడవు, 19.5 అడుగుల ఎత్తు, 14 అడుగుల వెడల్పు కలిగిన ఈ శిలను 284 చక్రాలు కలిగిన ప్రత్యేక భారీ వాహనం ద్వారా త్వరలో ఫసల్‌వాది విద్యాపీఠానికి తరలించనున్నారు. శ్రీ కైలాస ప్రస్తార మహామేరు నిర్మాణంలో భాగంగా ఈ విగ్రహాన్ని రూపొందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మహేశ్వర శర్మ సిద్ధాంతి చేపట్టిన ఈ గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం సంగారెడ్డి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తుందని అన్నారు. ఇంతటి భారీ నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణానికి సంకల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ మహాక్రతువు విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భక్తులు, ప్రజలు, దాతలు తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి అండగా నిలవాలని కోరారు. తాను కూడా వ్యక్తిగతంగా తన వంతు సహకారం అందిస్తానని ప్రకటించారు.

అదేవిధంగా విద్యాపీఠం, ఆశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా అవసరమైన నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ నిర్మాణం పూర్తయితే ఫసల్‌వాది దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.

అంతకుముందు మహేశ్వర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ.. నందీశ్వర స్వామి విగ్రహ నిర్మాణ విశిష్టత, శ్రీ కైలాస ప్రస్తార మహామేరు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను వివరించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, పలువురు కాంగ్రెస్ నాయకులు, విద్యాపీఠ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code