Wanted Reporters

Wanted Reporters

అత్యంత ధనవంతుడైన ముకేష్ అంబానీ దినచర్య

 ఉదయం లేవగానే జిమ్, 19వ అంతస్తులో అల్పాహారం.. ఇది అత్యంత ధనవంతుడైన ముకేష్ అంబానీ దినచర్య..


రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది. భారతదేశంలో మాత్రమే కాదు మొత్తం ఆసియాలోనే ముకేష్ అంబానీ భార్య నీతా అంబానీల అత్యంత ధనవంతులైన జంట. 


ముకేష్ అంబానీ ఆదాయాన్ని చూస్తే, అతను ప్రతి గంటకు 90 కోట్లు సంపాదిస్తున్నాడు అంటే ప్రతి నిమిషానికి 1.5 కోట్లు సంపాదిస్తున్నట్లు. భారతదేశపు అత్యంత ధనవంతుడు, బిలియనీర్ దినచర్య ఎలా ఉంటుందో తెలుసుకుందాం..



ముకేష్ అంబానీ దినచర్య గురించి మీడియా నివేదికల ద్వారా, కొన్ని ఇంటర్వ్యూలలో స్వయంగా ముకేష్ అంబానీ లేదా అతని భార్య నీతా అంబానీ తన దినచర్య గురించి చెప్పారు.ఇంట్లో ఉదయాన్నే మొదట లేచే వారిలో ముకేష్ అంబానీ ఒకరు. అతను రోజూ ఉదయం 5 నుంచి 5.30 గంటల మధ్య నిద్ర లేస్తాడు. లేచిన తరువాత మొదట జిమ్‌ చేస్తాడు. ముకేష్ అంబానీ ఇల్లు  ఆంటిలియాలోని రెండవ అంతస్తులో విలాసవంతమైన జిమ్ ఉంది.జిమ్ నుండి వచ్చిన తరువాత అతను స్నానం చేసి ధ్యానం చేస్తాడు. ఆ తరువాత 7.30 నుడి 8.00 గంటల మధ్య అల్టిలియా 19వ అంతస్తులో అల్పాహారం చేస్తాడు.



చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ముకేష్ అంబానీ పూర్తిగా స్వచ్ఛమైన శాఖాహారి. అల్పాహారం కోసం అతను బొప్పాయి రసం, వోట్ మీల్ లేదా పెరుగుతో మిస్సి రోటీని ఇష్టపడతాడు.



ఉదయం 9 నుంచి ఉదయం 10 గంటల మధ్య ఆంటిలియాలోని  14వ అంతస్తులో ఉన్న తన గదికి వెళ్ళి రెడీ అవుతాడు.10 నుంచి 11 గంటల మధ్య అతను ఇంటి నుండి కార్యాలయానికి వెళ్తాడు. 




కార్యాలయానికి వెళ్ళే ముందు అతను ఖచ్చితంగా తన తల్లి, భార్య, పిల్లలతో కొంత సమయం గడుపుతాడు. అయితే తల్లి ఆశీర్వాదం తీసుకోకుండా ఇంటిని వదిలి వెళ్ళరు.ముకేష్ అంబానీ తన హెడ్ ఆఫీస్‌లో 10 నుంచి 12 గంటల సమయం గడుపుతాడు. 



తరువాత రాత్రి 11 తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు.       ముకేష్ అంబానీ ఎంత ఆలస్యంగా వచ్చినా నీతా అంబానీతో కలిసి ఇంట్లో భోజనం చేస్తారు.

Post a Comment

0 Comments

Ad Code