Wanted Reporters

Wanted Reporters

సోనియా గాంధీ జీవితంపై తెలుగులో సినిమా తీస్తా:టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి


 సోనియా గాంధీ జీవితంపై తెలుగులో సినిమా తీస్తా

సంగారెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలు

రూ.2 కోట్ల విరాళం ప్రకటించిన కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్ జులకంటి ఆంజనేయులు

సినిమా నిర్మాణానికి 50 మందితో కమిటీ ఏర్పాటు చేస్తాం: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి


సంగారెడ్డి,వాస్తవ తెలంగాణ న్యూస్:

సంగారెడ్డి: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ స్వయంగా రచించిన ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం ఆధారంగా ఆమె జీవిత చరిత్రను తెలుగులో సినిమాగా తెరకెక్కిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఈ సినిమాకు సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. సినిమా నిర్మాణానికి నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ జులకంటి ఆంజనేయులు రూ.2 కోట్లు విరాళంగా అందిస్తానని ప్రకటించారు.

50 మందితో ప్రత్యేక కమిటీ

సినిమా నిర్మాణానికి సంబంధించి 50 మందితో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని జగ్గారెడ్డి తెలిపారు. ఈ కమిటీని గాంధీభవన్ పీఆర్వో హరిప్రసాద్ పర్యవేక్షిస్తారని వెల్లడించారు. నాయకులు, కార్యకర్తలు సినిమా నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఖర్చు చేసినట్లుగానే ఈ సినిమాను కూడా ఒక బాధ్యతగా భావించి బడ్జెట్ సిద్ధం చేయాలని కోరారు. మంచి దర్శకుడిని ఎంపిక చేసి, అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్ చేతుల మీదుగా సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. సోనియాగాంధీ జీవితాన్ని ప్రతి కార్యకర్త తెలుసుకునేలా ఆమె రచించిన పుస్తక ప్రతులను తెప్పించి పంపిణీ చేస్తామని తెలిపారు.

Post a Comment

0 Comments

Ad Code