Wanted Reporters

Wanted Reporters

సంగారెడ్డిలో నూతనంగా విజన్ ఆర్కిటెక్ట్స్ కార్యాలయం ప్రారంభం

 


సంగారెడ్డిలో నూతనంగా విజన్ ఆర్కిటెక్ట్స్ కార్యాలయం ప్రారంభం

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి  చేతుల మీదుగా ఘనంగా ప్రారంభోత్సవం

సంగారెడ్డి,వాస్తవ తెలంగాణ న్యూస్: 

సంగారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన విజన్ ఆర్కిటెక్ట్స్ కార్యాలయాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, నేటి ఆధునిక నిర్మాణ రంగంలో ఆర్కిటెక్ట్స్ సేవలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన డిజైన్లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవలు అందిస్తూ సంస్థ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
నూతనంగా ప్రారంభమైన విజన్ ఆర్కిటెక్ట్స్ కార్యాలయం ద్వారా సంగారెడ్డి ప్రాంత ప్రజలకు మెరుగైన ఆర్కిటెక్చరల్ సేవలు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు, స్థానిక నాయకులు, ప్రముఖులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.
.

Post a Comment

0 Comments

Ad Code