వివిధ శుభకార్యాల్లో పాల్గొని నూతన వధూవరులు, గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపిన మాద్రి పృథ్వీరాజ్
పటాన్‌చెరు,వాస్తవ తెలంగాణ న్యూస్:
పటాన్‌చెరు పట్టణ పరిధిలో నిర్వహించిన పలు శుభకార్యాల్లో మాద్రి పృథ్వీరాజ్ పాల్గొని నూతన వధూవరులు, నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
పటాన్‌చెరు పట్టణంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భవన్‌లో జరిగిన జ్ఞానేశ్వర్ – వాహిని వివాహ వేడుకకు హాజరైన ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
అదేవిధంగా సాయిరాం నగర్ కాలనీలో నిర్వహించిన మహేష్ – అవినాష్ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన గృహంలో ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని అభిలషించారు.


0 Comments